మేయర్, డిప్యూటీ మేయర్‌కు ఘన సత్కారం
మహబూబ్ నగర్ నగరపాలక సంస్థకు నూతనంగా మేయర్‌గా ఎన్నికైన గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మారేపల్లి సురేందర్ రెడ్డిని డీసీసీ జనరల్ సెక్రెటరీ సిరాజ్ ఖాద్రి గురువారం ఘనంగా శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన మేయర్, డిప్యూటీ మేయర్లు మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.