జీసీసీ కార్యాలయం వద్ద గ్యాస్ వినియోగదారులు పడిగాపులు

జీసీసీ కార్యాలయం వద్ద గ్యాస్ వినియోగదారులు పడిగాపులు

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో స్థానిక జీసీసీ కార్యాలయంలో గ్యాస్ కొరత తీవ్రంగా నెలకొంది. మండలంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. అవసరమైన సిలిండర్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.