VIDEO: శ్రీశైలంలో జ్వాలా తోరణంలో పాల్గొన్న రోజా
CTR: శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలాతోరణం ఉత్సవం వైభవంగా జరిగింది. మాజీ మంత్రి రోజా జ్వాలా తోరణంలో పాల్గొని దీపం వెలిగించారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా హర హర మహాదేవ, ఓం నమశ్శివాయాలతో మారు మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.