కాసేపట్లో వర్షం.. మ్యాచ్‌కు అంతరాయం

కాసేపట్లో వర్షం.. మ్యాచ్‌కు అంతరాయం

TG: హైదరాబాద్‌లో మరికాసేపట్లో వర్షం పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, నాగర్ కర్నూలు, మేడ్చల్ జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అయితే ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో IPL మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్‌కు అంతరాయం కలుగుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.