మండలానికి నేడు యూరియా రాక..!

WNP: ఆత్మకూరు మండలం రైతులకు శుక్రవారం మధ్యాహ్నం యూరియా పీఎసీఎస్‌కు వస్తుందని మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని పీఎసీఎస్ రేచింతల స్టాక్ పాయింట్‌లో 300 యూరియా బ్యాగులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కావున రేచింతల, ఆరేపల్లి, కతేపల్లి గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.