'సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు'

BDK: మణుగూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సైబర్ నేరాలపై స్థానిక ప్రజలకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మేడా ప్రసాద్ పాల్గొని అవగాహన కల్పించారు. ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారం షేర్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా తెలియని ఫోన్ కాల్స్, లింకులను ఓపెన్ చేయకూడదని సూచించారు.