రహదారి మరమ్మతులు చేపట్టాలని BJP కార్యకర్తలు నిరసన

హనుమకొండ జిల్లా వేలేరు గ్రామ రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం కార్యకర్తలతో కలిసి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు రాజు యాదవ్ నిరసన తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో అధ్వానంగా మారిన రహదారి పనులను వెంటనే చేపట్టాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.