కెరమెరిలో అత్యధికంగా 83.38 శాతం పోలింగ్ నమోదు
ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 5 మండలాల్లో మొత్తంగా 96,068 మంది ఓటర్లకు గాను 76,668 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కెరమెరి మండలంలో అత్యధికంగా 83.38 శాతం పోలింగ్ నమోదైంది. సిర్పూర్ (యూ) 81.18 శాతం వాంకిడి 78.93, లింగాపూర్ 79.61 శాతం , జైనూర్ 76.81 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.