నష్టపోయిన పంటలను పరిశీలించిన కలెక్టర్
BHPL: పలిమెల మండలం లెంకలగడ్డ శివారు అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 30-40 ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు ధ్వంసమయ్యాయి. గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు నష్టం అంచనా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.