52 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
ASF: సిర్పూర్-టీ మండలం వెంకట్రావ్ పేట చెక్ పోస్ట్ వద్ద గురువారం ఎన్ఫోర్స్‌మెంట్ సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో PDS బియ్యం అక్రమ రవాణా బయటపడింది. మొత్తం 52 క్వింటాళ్ల బియ్యం, 7 ద్విచక్ర వాహనాలు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.