రైతులకు ప్రధాని మోదీ ద్రోహం: రాహుల్ గాంధీ

రైతులకు ప్రధాని మోదీ ద్రోహం: రాహుల్ గాంధీ

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. వాణిజ్య ఒప్పందంతో మన దేశానికి చెందిన డేటా వనరులన్నింటినీ అమెరికాకు అప్పగించారంటూ ఆరోపించారు. భారత డేటా ప్రపంచంలోనే అత్యంత విలువైందని తెలిపారు. అయితే, బీజేపీ ప్రభుత్వం దాని విలువను సరిగ్గా గుర్తించలేకపోయిందని అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి, భారత రైతులకు మోదీ ద్రోహం చేశారని మండిపడ్డారు.