VIDEO: 'యుద్ధ సంక్షోభం నుంచి ప్రజలు బయటపడాలి'

VIDEO: 'యుద్ధ సంక్షోభం నుంచి ప్రజలు బయటపడాలి'

కోనసీమ: ఇరాన్ యుద్ధం త్వరగా ముగిసి యుద్ధ సంక్షోభం నుంచి ప్రజలు అందరూ బయటపడాలని మండపేట వైసీపీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. గురువారం తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యుద్ధ వాతావరణం పూర్తిగా తొలిగి పోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.