భద్రాద్రిలో కన్నుల పండుగగా సీతారాముల తిరు కళ్యాణం

భద్రాద్రిలో కన్నుల పండుగగా సీతారాముల తిరు కళ్యాణం

BDK: చైత్ర శుద్ధ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల తిరు కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ సతీమణులతో కలిసి పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. రామయ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.