ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ర్యాలీ

ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ర్యాలీ

నంద్యాల: రుద్రవరం మండల కేంద్రంలో మంగళవారం నాడు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శివ మోహన్, డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, రాత్రి పూట దోమ తెరలు వాడాలని, ప్రతి ఒకరు దోమలు కుట్టకుండా నిండు దుస్తులు దరించాలని సూచించారు.