కడప దర్గాలో తెలంగాణ ఎమ్మెల్యే ప్రార్థనలు

KDP: కడపలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ పెద్ద దర్గాలో తెలంగాణ రాష్ట్రం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిన్న రాత్రి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషతో కలిసి దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా ప్రతినిధులను విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు.