అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

ASF: సిర్పూర్ (టీ) మండలం పరిగావ్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, యజమాని దుర్కే రాజనీకాంత్, డ్రైవర్ టికాజీపై కేసు నమోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.