మందస పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛభారత్ నిర్వహణ

SKLM: మందస మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛభారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమాలను నిర్వహించామని ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమాలను స్థానిక స్టేషన్‌లో చేపడుతున్నామని వివరించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించామని అన్నారు.