VIDEO: రైల్వే స్టేషన్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు
కడప నగరంలోని రైల్వే స్టేషన్‌లో 1 టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎస్సై అమర్నాథ్ రెడ్డి తన సిబ్బందితో పాటు బాంబు స్క్వాడ్ సిబ్బందితో అణువణువునా గాలించారు. అనుమానంగా ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.