పటాన్‌చెరులో జంట హత్యల కలకలం
SRD: పటాన్‌చెరు పరిధిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇంద్రేషం మున్సిపాలిటీలోని సిటీజేన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద పని చేస్తున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతులను మహబూబాబాద్‌కు చెందిన దశరథ్, మాన్యమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.