VIEO: ఆంజనేయ స్వామికి పంచామృత, సింధూర అభిషేకం
ప్రకాశం: కనిగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో గురువారం ఉదయం ఆంజనేయ స్వామికి పంచామృత, సింధూర అభిషేకం వైభవంగా జరిగింది. ఆలయ అర్చక గురుస్వామి రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షా స్వాములచే 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం పూజారులు భక్తులను ఆశీర్వదించారు.