తిరుమల శ్రీవారి సేవలో దాసరి అరుణ్ కుమార్

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని తెలుగు సినీ దర్శకులు దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.