వరంగల్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు

వరంగల్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు

TG: వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు వచ్చాయి. భద్రకాళి ఆలయ ధర్మకర్తల కమిటీ ఏర్పాటుపై వివాదం నెలకొంది. 12 మంది సభ్యుల్లో కనీసం ఏడుగురు వరంగల్ వెస్ట్ కార్యకర్తలు లేకపోవడంతో.. భద్రకాళి ఆలయ ధర్మకర్త పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. వరంగల్ వెస్ట్ నేతలకు ధర్మకర్తల కమిటీ వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.