కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా స్పాంజ్ ఐరన్ మ్యానిఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కళ్యాణ మండపం ప్రారంభించారు. డి.హిరేహాల్ మండలంలోని హిర్దేహాల్ వద్ద గురువారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అసోసియేషన్ నాయకులతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం కమ్యునిటి హాల్‌ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.