యలమర్రులో ఎరువుల రికార్డుల తనిఖీ

యలమర్రులో ఎరువుల రికార్డుల తనిఖీ

కృష్ణా: పెదపారుపూడి మండలం యలమర్రు పీఎసీఎస్ యూరియా నిల్వలపై గుడివాడ డివిషనల్ సహకార అధికారి ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ అధికారి నాగభూషణం శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ ఏరియా సక్రమంగా అందే విధంగా చూడాలని సూచనలు చేశారు.