పెద్దతిప్పసముద్రంలో నేడు ఉచిత మెడికల్ క్యాంప్

పెద్దతిప్పసముద్రంలో నేడు ఉచిత మెడికల్ క్యాంప్

అన్నమయ్య: పెద్దతిప్పసముద్రంలో ఈనెల 19న ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నారు. మండలంలోని యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ వారి సహకారంతో శిబిరం ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు. శిబిరంలో గుండె, క్యాన్సర్, ఎముకలు, కీళ్లు, తదితర వ్యాధులకు సంబంధించి వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.