గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

GNTR: నల్లపాడులోని శ్రీనివాసకాలనీ వినాయకస్వామి ఆలయం వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు లభించకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసినవారు నల్లపాడు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.