ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన.. మహిళ మృతి

ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన.. మహిళ మృతి

GNTR: పొన్నూరు మండలం ములకుదురులో ఆదివారం ఓ కారును ట్రావెల్స్ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన పెరికలు అన్నమ్మ(50) మృతి చెందింది. మిగత వారికి స్వల్ప గాయాలు కాగా చికిత్స కోసం గుంటూరు తరలించారు. అన్నమ్మ మృతితో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.