'వైద్య విద్యార్థులతో ఇంటివద్దె వైద్యం'

NLR: బుచ్చి మండలంలోని పెనుబల్లి గ్రామంలో జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో కుటుంబ ఆరోగ్య దత్తత కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ పెంచలయ్య, హెచ్ఓడి గోవిందు, ఎంపీటీసీ నారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక దశలోనే వైద్యం ఎలా అందించాలో విద్యార్థులకు అవగాహన వస్తుందన్నారు.