జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
CTR: ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ తెలిపారు. వైసీపీ ఆవిర్భావ వేడుకలను పలమనేరు చర్చి ఎదురుగా గురువారం నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో పాటు, మళ్ళీ జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.