అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై

KRNL: గ్రామంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడటం, ఘర్షణలకు దిగడం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి హెచ్చరించారు. గడివేముల మండల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం రాత్రి గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఆయన సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావలన్నారు.