పార్టీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించాలి: మంత్రి

పార్టీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించాలి: మంత్రి

GNTR: పార్టీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. పార్టీ పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించే చర్యలను సహించేది లేదన్నారు.