రజక సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మడేలేశ్వర ఆలయ సమీపంలో రజక సహకార సంఘం నూతన సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుల సంఘాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా రజక సంఘ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.