రేపు టెక్కలిలో న్యాయవిజ్ఞాన సదస్సు

రేపు టెక్కలిలో న్యాయవిజ్ఞాన సదస్సు

SKLM: టెక్కలి పట్టణంలోని ఎంజేపీఎపీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ పాఠశాలలో " లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 " అనే అంశంపై శుక్రవారం సాయంకాలం నాలుగున్నర గంటలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు టెక్కలి సీనియర్ సివిల్ జడ్జి జె. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయవాదులు పోలీసులు, అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు.