ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన బస్సు.. నలుగురికి తీవ్ర గాయాలు

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన బస్సు.. నలుగురికి తీవ్ర గాయాలు

NLG: వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు బస్సు, ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.