పీఎసీఎస్ రధసారథులను అభినందించిన ఎమ్మెల్యే

E.G: వేమగిరి గ్రామంలో వేమగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఎసీఎస్) ఛైర్మన్‌గా వెలుగుబంటి వెంకటాచలం (నాని), డైరెక్టర్లుగా పితాని శివరామకృష్ణ, పల్లెపు మూర్తి త్రీమెన్ కమిటీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి రవి రామ్ కిరణ్ తదితరులు నూతన రధసారథులకు అభినందనలు తెలిపారు.