శబరిమల భక్తుల పాదయాత్ర ప్రారంభం

శబరిమల భక్తుల పాదయాత్ర ప్రారంభం

నల్గొండ: చింతపల్లి మండలం గోడకొండ్ల, మాల్టెన్ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాముల శబరిమల పాదయాత్ర ఉదయం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. స్వాములు 'స్వామియే శరణం అయ్యప్ప' అని నినాదాలు చేస్తూ కదిలారు. దీంతో మండలంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులకు ఈ యాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు కొనియాడారు.