నేడు జిల్లాకు రానున్న పొంగులేటి

నేడు జిల్లాకు రానున్న పొంగులేటి

KMM: జిల్లాలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా తిరుమలాయపాలెం (మం) హస్నాబాద్, ఏలువారిగూడెంలో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం ఖమ్మం నగరం, కల్లూరు మండలంలో పర్యటిస్తారన్నారు.