నేడే పరీక్ష.. వీటిని తీసుకెళ్లకండి!

TG: MBBS ప్రవేశాల కోసం చేపట్టే నీట్ పరీక్ష ఇవాళ దేశవ్యాప్తంగా జరగనుంది. రాష్ట్రంలో నీట్ 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో జరగనుంది. HYDలో అత్యధికంగా 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 1:30 గం.లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలి. గడియారాలు, బూట్లు, ఇతర గ్యాడ్జెట్లు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు.