కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభిస్తుంది
KMM: నెలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ దయాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల కోరిక మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు.