మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం

NLR: ఇందుకూరుపేట మండలంలో మతిస్థిమితం లేని యువతిపై శ్రీనివాసులు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రామస్తులు అతడిని స్తంభానికి కట్టి, దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై నాగార్జున రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.