ఉప్పల్ పెద్ద మార్కెట్లో పెరిగిన టమాట ధర
MDCL: ఉప్పల్ పరిధిలోని కూరగాయల పెద్ద మార్కెట్లో టమాట ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో కిలోకు రూ.15 నుంచి రూ.20 మధ్య లభించిన టమాట ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముడవుతోంది. సరఫరా తగ్గడం, ఎండల తీవ్రత పెరగడం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.