పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్
MBNR: అరుణాచలం గిరి ప్రదక్షిణకు మహబూబ్ నగర్ డిపో నుంచి సూపర్ డీలక్స్ బస్ నడుపుతున్నట్లు బుధవారం డిపో మేనేజర్ సుజాత తెలిపారు. ఈనెల 10వ తేదీన రాత్రి 7 గంటలకు బస్ డిపో నుంచి బయలు దేరుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కాణిపాకం, మహాలక్ష్మి, అరుణాచలం చేరుకుని అరుణాచలం గిరిప్రదక్షిణ అనంతరం నవంబర్ 17వ తేదీన మహబూబ్ నగర్‌కు చేరుకుంటుందన్నారు.