VIDEO: ఇసుక తవ్వకాలకు నాగవళి నదిలో గ్రావెల్ రోడ్డు
VZM: వంగర మండలం ఓని అగ్రహారం పరిసరాల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండ ప్రాంతాల్లో భారీ యంత్రాలతో గ్రావెల్ తరలిస్తున్నారని తెలిపారు. నాగవళి నదిలో ఇసుక తరలింపుకు నది మధ్యలోనే గ్రావెల్ రహదారి నిర్మించారని గ్రామస్తులు పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలని కోరుతున్నారు.