నేడు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రామ్ రామ్..!
JGL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా హాట్ టాపిక్‌గా మారింది. ఇవాళ ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన అనంతరం సుమారు 7000 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. BRS నుంచి గెలిచిన MLA సంజయ్ రేవంత్ సర్కార్‌తో కలిసి పనిచేస్తుండటంతో జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. వచ్చేనెల 5 నుంచి 10లోపు జరిగే భారీ సభలో మాజీ CM KCR సమక్షంలో BRSలోకి చేరనున్నారని తెలుస్తోంది.