VIDEO: కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల నిరసన

CTR: తమ న్యాయబద్దమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 13వ రోజు గురువారం పుంగనూరు పురపాలక కార్యాలయం ఎదుట తమ డిమాండ్‌లను తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు.