హనుమాన్ ఆలయంలో ఘర్షణ.. వ్యక్తికి గాయాలు
MNCL: వేమనపల్లి మండలానికి చెందిన డోకే వెంకటిపై మంగళవారం హనుమాన్ ఆలయంలో ఎల్లెల శ్రీను దుడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటి గాయపడగా విషయం తెలుసుకున్న సర్పంచ్ ఉప్పులపు సాయికృష్ణ వెంకటిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్ ద్వారా చెన్నూర్ ఆసుపత్రికి తరలించారు