'మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం'
KDP: చిన్నమండెలో బుధవారం రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం తన బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. DWCRA పథకం ద్వారా మహిళలు వేల కోట్లు రుణాలు పొందుతున్నారని, పొదుపు చేసిన మొత్తం రూ. 25 వేల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. మహిళలు చిన్న మొత్తాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.