బైక్‌ను ఢీ కొన్న లారీ.. వ్యక్తి మృతి

బైక్‌ను ఢీ కొన్న లారీ.. వ్యక్తి మృతి

MNCL: జైపూర్ మండలం ఇందారం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. బెజ్జాల గ్రామపంచాయతీ మద్దులపల్లికి చెందిన మల్లేష్ బైక్‌పై గోదావరిఖనికి వెళ్తుతున్నాడు. ఈ క్రమంలో ఇందారం వద్ద వెనక నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైకర్ మల్లేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.