సచివాలయంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సచివాలయంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NDL: బేతంచెర్ల మండలం ఆర్. కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో అందుతున్న సేవలు, ప్రజలకు ఉన్న సదుపాయాలను తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ హాజరు వివరాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.