జమ్మిచెడు జమ్ములమ్మ అద్భుత రూపం
GDWL: జోగులాంబ గద్వాల జిల్లా సమీపంలో వెలసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అభిషేకం, ఆకు పూజ హోమం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కలిగించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.